రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

  • రేపు ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాల ప్రారంభం
  • మాజీ ఎమ్మెల్యే లాస్యనందితకు సంతాపం తెలపనున్న అసెంబ్లీ
  • సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదట మాజీ ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆమె ప్రమాదంలో మృతి చెందారు.

లాస్య నందితకు సంతాపం తెలిపే తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. సంతాపం అనంతరం అసెంబ్లీని వాయిదా వేయనున్నారు. అనంతరం సభా వ్యవహారాల సలహా సంఘం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, అజెండాను ఖరారు చేయనున్నారు.

Telangana
Telangana Assembly Session
Revanth Reddy

More Telugu News